Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ కోడ్‌తో ప.గో.వాసులకు ఫోన్ కాల్స్.. వణికిపోతున్న ప్రజలు

పాకిస్థాన్ కోడ్ నంబరుతో వస్తున్న ఫోన్ కాల్స్‌తో పశ్చిమ గోదావరి జిల్లావాసులు వణికిపోతున్నారు. ఎందుకొస్తున్నాయో తెలియక భయపడుతున్నారు. నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు +92 3045414385 నంబరుతో తరచూ ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఆ కాల్స్‌ను లిఫ్ట్ చేసేందుకు వినియోగదారులు భయపడుతున్నారు. ఇక్కడి సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ హ్యాకర్లే ఈ కాల్స్ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో భారత ఆర్మీ నుంచి వస్తున్న హెచ్చరికలు కూడా వీరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఫోన్ కాల్స్ వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More Telugu News